| ఇతిహాసములు | మొల్ల రామాయణము | బాల కాండము |
| కౌసల్యా కైకేయీ సుమిత్రల దౌహృద లక్షణములు | ||
| వ. |
అంతం గొన్ని దినంబులకుఁ గౌసల్యా కైకేయీ సుమిత్రలు గర్భవతులై యొప్పారుచుండ, |
42 |
| సీ. |
ధవళాక్షు లనుమాట తథ్యంబు గావింపఁ-దెలు పెక్కి కన్నులు తేట లయ్యె, నీల కుంతల లని నెగడిన యా మాట-నిలుపంగ నెఱులపై నలుపు సూపె, గురు కుచ లను మాట సరవి భాషింపఁగఁ-దోరమై కుచముల నీరు వట్టె, మంజు భాషిణు లను మాట దప్పక యుండ-మెలఁతల పలుకులు మృదువు లయ్యెఁ, |
|
| తే. |
గామిను లటంట నిక్కమై కాంతలందు-మీఱి మేలైన రుచులపైఁ గోరి కయ్యె, సవతి పోరనఁ దమలోన సారె సారె-కోకిలింతలు బెట్టు చిట్టుములుఁ బుట్టె. |
43 |
| వ. | మఱియును, | 44 |
| సీ. |
తనుమధ్య లను మాటఁ దప్పింపఁ గాఁబోలు-బొఱ లేక నడుములు పొదలఁ జొచ్చెఁ గుచములు బంగారు కుండలో యను మాట-కల్లగా నగ్రముల్ నల్ల నయ్యెఁ, జంద్రాస్య లను మాట సరవి మాన్పఁగఁ బోలుఁ-గళల విలాసమ్ము పలుచ నయ్యె, సుందరు లను మాట సందియమ్ముగఁ బోలు-గర్భ భారమ్ములఁ గాంతి దప్పె, |
|
| తే. |
ననుచుఁ గనుగొన్న వారెల్ల నాడుచుండఁ-గట్టు చీరెల వ్రేఁకంబు పుట్టుచుండ నా సతులఁ జూచి యందఱు నలరుచుండఁ-గాంతలకు నప్డు గర్భముల్ కానుపించె. |
45 |