| ఇతిహాసములు | మొల్ల రామాయణము | బాల కాండము |
| సీతా స్వయంవరము | ||
| సీ. |
ద్రవిడ కర్ణాటాంధ్ర యవన మహారాష్ట్ర-రాజ కుమారులు తేజ మలరఁ బాండ్య ఘూర్జర లాట బర్బర మళయాళ-భూప నందనులు విస్ఫూర్తి మీఱ, గౌళ కేరళ సింధు కాశి కోసల సాళ్వ-ధరణీశపుత్రులు సిరి వెలుంగ, మగధ మత్స్య కళింగ మాళవ నేపాళ-నృప తనూభవులు నెన్నికకు నెక్క, |
|
| తే. |
మఱియు నుత్కల కొంకణ మద్ర పౌండ్ర-వత్స గాంధార సౌరాష్ట్ర వంగ చోళ రాజ్యముల నొప్పు ఛప్పన్న రాజ సుతులు-వచ్చి రక్కామినీ స్వయంవరమునకును. |
67 |
| ఉ. |
కొందఱు పల్లకీల, మఱి కొందఱు తేరుల, నందలంబులం గొందఱు, కొంద ఱశ్వములఁ, గొందఱు మత్త గజేంద్ర సంఘమున్ గొందఱు స్వర్ణ డోలికలఁ, గోరిక నెక్కి నృపాల నందనుల్ సందడిఁగాఁగ వచ్చిరి, బుజంబు బుజంబును ద్రోపులాడఁగన్. |
68 |
| వ. | అట్టి సమయంబున. | 69 |
| చ. |
గురు భుజ శక్తి గల్గు పదికోట్ల జనంబులఁ బంప, వారు నా హరుని శరాసనంబుఁ గొనియాడుచుఁ బాడుచుఁ గొంచు వచ్చి, సు స్థిరముగ వేదిమధ్యమునఁ జేర్చిన, దానికి ధూప దీపముల్ విరులును గంధ మక్షతలు వేడుక నిచ్చిరి చూడ నొప్పుగన్. |
70 |
| వ. | అట్టి సమయంబున జనక భూపాలుండు రాజ కుమారులం గనుంగొని యిట్లనియె. | 71 |