ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - తృతీయాశ్వాసము
మండోదరీ విలాపము
వ. అట్టి సమయంబున మందోదరి మొదలైన అంతఃపుర సుందరీ సందోహంబు లేతెంచి తమ
ప్రాణేశ్వరుండైన రాక్షసకుల సార్వభౌముంగని వక్షంబులు శిరములు మోఁదుకొనుచు
బహువిధంబులఁ బ్రలపించుచుఁ బరివేష్టించికొని యుండ భూకాంతుండు శాంతాలాపంబుల
ననునయించి విభీషణుంగని నీవు దుఃఖం బుడిగి మీయన్నకు నగ్నిసంస్కారాది విధుల
నాచరింపు మనిన నతం డట్ల కావించిన యనంతరంబ విభీషణుని లంకానగరంబునకు
బట్టంబు గట్టించిన నతండు సుగంధద్రవ్యంబులును నవరత్నఖచితంబులైన భూషణంబులును
జీని చీనాంబరంబులును గానుకగా నిచ్చినం బరిగ్రహించి యవియెల్లను మాతలికిచ్చి
ప్రియోక్తులం దనిపి యనిపిన నతండు స్వర్గంబునకుం జనియె నయ్యవసరంబున.
111
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - tR^itIyAshvAsamu ( telugu andhra )