ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - తృతీయాశ్వాసము
బ్రహ్మ సీత సౌశీల్యమును బ్రస్తుతించుట
ఆ. అంతఁ బద్మగర్భుఁ డవనీశుఁ డగురామ
భద్రుఁ జూచి పలికెఁ బరమపురుష!
వనజనేత్ర సీతవలన దోసము లేదు
నమ్ము వసుమతీశ! నాదుమాట.
119
వ. అని పలికిన పితామహునిమాటల కుభయసేనలును సంతసిల్లినవి. అనంతర మగ్నిభగవానుండు
నయ్యంగనం గొనివచ్చి పరమ పతివ్రతాభరణం బగు నిద్ధరాతనూజాతం గైకొమ్మని
యప్పగించిన నయ్యెడ దశరథుండు ప్రసన్నుండైన శ్రీరామచంద్రుండు సతీసమేతుండై తమ్ముండును
దానును నమస్కరించినఁ గుమారద్వయంబును గోడలిని నాలింగనంబుచేసి తద్దుఃఖంబులం బాపి
చనియె నప్పుడు సకలదేవతలు నిట్లనిరి.
120
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - tR^itIyAshvAsamu ( telugu andhra )