యుద్ధకాండము-34
రాగం: హిందూఘంటా - తాళం: ఆది
పల్లవి:
అని బ్రహ్మ రామచంద్రుని గొనియాడన్ శ్రుతి చూడన్ ॥అని॥
అనుపల్లవి:
అనలుం డాహరి వేఁడన్ జనె జానకి తోడన్ ॥అని॥
చరణములు:
సీతాపతి మహాధృతి నీచేత నిర్ణీత
త్రేతాయుగ జాతారి నిర్ఘాతలోకమాత ॥అని॥
నీవు నాయందు దాఁచిన రమణిన్ బ్రపన్నసురమణిన్
దేవ చేకో రావణాంతక దీనపాలతిలక ॥అని॥
కలువతమ్ముల కొలనిలో సిరి కరణిన్ తగు తరుణిన్
మలికితం బెడఁ బనిచెన్ శ్రీహరి మనిచెన్ దొడ నునిచెన్ ॥అని॥
యోషాగ్రణి శేషాద్రివిభూషామణి వెలుఁగన్
దోషాధిక రోషావళిఁ దొలఁగున్ ॥అని॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi