| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | శ్రీ గాయత్రీదేవి సనాతని సేవకజన సుశ్రేయోదాయిని |
| వలజి - ఆది | |
| పల్లవి: | |
| శ్రీ గాయత్రీదేవి సనాతని సేవకజన సుశ్రేయోదాయిని | ॥శ్రీ॥ |
| అనుపల్లవి: | |
| వాగధిపతి సురేంద్రపూజితే వరదాయకి పంచవదనే సుహాసిని | ॥శ్రీ॥ |
| చరణము(లు): | |
| రాగద్వేష రహితాంతరంగ హితే రత్నఖచిత మణిహారమండితే రసహిత సంగీత మోదితే రాఘవాది భక్తరక్షణ చరితే | ॥శ్రీ॥ |