| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | అకారాది సంకీర్తన సూచిక |
శ్రీ ఓగిరాల వారి కుమార్తె శ్రీమతి విమల గారిని ఈ కీర్తనల విషయమై సంప్రతించగానే, తమ భర్త శ్రీ బులుసు
రామచంద్రుడు గారిద్వారా, అత్యంత సౌహార్దంగా వారు తమ సమ్మతిని తెలియపరిచారు. అంతేగాక,
తెలుగు తమిళములలో ఉన్న ఓగిరాల వారి దేవీగానసుధ పుస్తకాలను పంపుతూ వాటితో పాటుగా
తెలుగులో లేకుండా తమిళ లిపిలోమాత్రమేనున్న నాలుగు కీర్తనలను మా కోసమై తెలుగు లిపిలో వ్రాసి ఇచ్చారు.
వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
ఈ వాగ్గేయకారుని జీవిత వివరములను మఱియు వీరి కృతులపై ప్రముఖుల అభిప్రాయములను ఇక్కడ చదువగలరు.