| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | నీపయి నామనసు నిల్ప |
| ముఖారి - రూపక | |
| పల్లవి: | |
| నీపయి నామనసు నిల్ప నిశ్చలభక్తి నీయవె అంబా | ॥నీ॥ |
| అనుపల్లవి: | |
| చపలాత్ముడనై తిరిగి నీ చరణాంబుజ సేవ మరచితి | ॥నీ॥ |
| చరణము(లు): | |
| కలిలో దారసుత ధనకాంచనముల గని భ్రమించి కలుషాత్ముడనైతి రాఘవుని కరమిడి కడు ముదమలరగ | ॥నీ॥ |