| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | భక్తికి సమభాగ్యములేదని శివ |
| సామ - ఆది | |
| పల్లవి: | |
| భక్తికి సమభాగ్యములేదని శివ శక్తి నారాధింపలేవా ఓ మనసా | ॥భక్తికి॥ |
| అనుపల్లవి: | |
| భుక్తిముక్తి ప్రదాయకి యని మది నిజా సక్తితో స్వరలయాది రక్తి దెలసి జేయు | ॥భక్తికి॥ |
| చరణము(లు): | |
| పూని ధర్మార్థకామముల నొసగు యాగ పూర్ణుడైతె జనన మరణము లుడుగునా రానుపోను మాను రాజమార్గమౌ దేవీ గానసుధాపాన విజ్ఞానముతో రాఘవుని | ॥భక్తికి॥ |