| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | నీ పదధ్యానము గల్గిననాడే |
| రీతిగౌళ - ఆది | |
| పల్లవి: | |
| నీ పదధ్యానము గల్గిననాడే నిత్యానందముగా గడచునమ్మ | ॥నీ॥ |
| అనుపల్లవి: | |
| తాపత్రయముల సంతాపము జెందక ఓ పరాత్పరీ ఓంకారీ యని | ॥నీ॥ |
| చరణము(లు): | |
| త్రిభువన నాయకి త్రిపురాంతకి శ్రీ త్రిపురసుందరి త్రినేత్రి పావని మాపురేపు మనసు రంజిల్లగ కృపామయీ శివకోమలి రాఘవునికి | ॥నీ॥ |