| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | తామసము శమింపగరాదా అంబ |
| అఠాణ - ఆది | |
| పల్లవి: | |
| తామసము శమింపగరాదా అంబ ధర్మస్వరూపిణి దయజేసి నా | ॥తామసము॥ |
| అనుపల్లవి: | |
| యీ మహి నీపదధ్యాన మేమరకుండు ఇంగితముగూర్చి ఇహపరదాయకి | ॥తామసము॥ |
| చరణము(లు): | |
| భూసురుడనై నే బుట్టి నిగమాది పుణ్యకర్మ లెరుగనైతిని పావని భాసురగాత్రి సద్భావముతోడను భవభయములెల్ల హరింపవె రాఘవుని | ॥తామసము॥ |