| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | కాపాడను నీవేగద |
| షణ్ముఖప్రియ - రూపక | |
| పల్లవి: | |
| కాపాడను నీవేగద కలిలో శివకామసుందరి నను | ॥కాపాడను॥ |
| అనుపల్లవి: | |
| లోపాలోపముల మది నవ లోకించుచు జాగుసేయక | ॥కాపాడను॥ |
| చరణము(లు): | |
| ప్రణవనాదముచేత నిన్ను - బ్రస్తుతింపగా సతతము గుణవిహీనుడనై మరి - ఘోషింపగవలసె జననీ ఫణిపతిభూషణునికి ప్రియ - రాణివైన శ్రీరాజేశ్వరి రాఘవుని | ॥కాపాడను॥ |