| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | శ్యామలగాత్రి పరాశక్తి అంబ |
| జంఝూటి - ఆది | |
| పల్లవి: | |
| శ్యామలగాత్రి పరాశక్తి అంబ | ॥శ్యామల॥ |
| అనుపల్లవి: | |
| వేమరు నిజభక్త వేదనల హరించు వేల్పు నీవేగదటె వేదాతీత | ॥శ్యామల॥ |
| చరణము(లు): | |
| భారమటే దీన - పాలినివైన త్రిశూలిని నన్ను బ్రోవవే కపాలిని | ॥శ్యామల॥ |
| కోరితి పరశివ - కోమలి నీ సేవ భారమనియంటినా పద్మాసని | ॥శ్యామల॥ |
| తోయజముఖి తల్లి - తోడు నీవేయని దోసిలొగ్గు రాఘవదాసావని | ॥శ్యామల॥ |