| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | నాదానందాను భవశాలికి |
| ఖరహరప్రియ - ఆది | |
| పల్లవి: | |
| నాదానందాను భవశాలికి నానావిధ యోనిజనన బాధలుండునె మనసా | ॥నాదా॥ |
| అనుపల్లవి: | |
| వేదవిదిత సుస్వర - విధమెరిగి నిఖిల సాధువరులు మన - సార సేవించు ప్రణవ | ॥నాదా॥ |
| చరణము(లు): | |
| లయశ్రుతి బద్ధమౌ - లాలిత్యముతో నియమనిష్టలొలుకు - నిజభక్తితో కాయజరిపుప్రియ - కాంతామణిముఖ సోయగమును జూచి- సోఽహమ్మను రాఘవనుత వర | ॥నాదా॥ |