| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | వే రెవ్వరమ్మ జనని నీసరి |
| రీతిగౌళ - ఖండజాతి త్రిపుట | |
| పల్లవి: | |
| వే రెవ్వరమ్మ జనని నీసరి వేల్పు జగతిలో భవాని పావని | ॥వేరె॥ |
| అనుపల్లవి: | |
| తీ రెరుగక సకల తీర్థముల మునిగి కడ తేరేరా మనుజులు కామిత ఫలదాయకి | ॥వేరె॥ |
| చరణము(లు): | |
| బాలేందు నిభానన నీ నామ ప్ర భావ మెరుగక సద్భావ దరిద్రుడై చాలా దుర్మోహజాలముల జిక్కి విడ జాలని రాఘవుని బ్రోవను | ॥వేరె॥ |