| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | ఆదిశక్తి శంకరి న - న్నాదరింపవే ఓ జగ |
| హిందోళ - రూపక | |
| పల్లవి: | |
| ఆదిశక్తి శంకరి న - న్నాదరింపవే ఓ జగ | ॥దాది॥ |
| అనుపల్లవి: | |
| వేదాగమవాసిని నా - విన్నపంబు లెల్ల విన రాదా శుకపాణి దీన - రక్షకి యను బిరుదులేదా త్రిజగ | ॥దాది॥ |
| చరణము(లు): | |
| రజతాచలమందు శివుని - రమణీయముగాను గూడి రాజిల్లు సకలముని సు - రాదివందిత పాదవాద గజముఖుని రీతి నన్ను - కరుణింపవె కల్పవల్లి నిజదాసుడౌ రాఘవుని - మన్నింపను నీమదిని సదా త్రిజగ | ॥దాది॥ |