| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | మనసున నిన్నే గురిజేసి |
| భైరవి - త్రిపుట | |
| పల్లవి: | |
| మనసున నిన్నే గురిజేసి మరులుకొన్నాను రావె అంబ | ॥మనసున॥ |
| అనుపల్లవి: | |
| దీనసంరక్షకి నా దిక్కు నీవని తెలిసి | ॥మనసున॥ |
| చరణము(లు): | |
| త్రిపుర భైరవి నా త్రిప్పట లెల్ల దెలిసి కృపసేయవలెగాని కోపముయేలనె సాపరాధిని నీ సద్భక్తి గల ప్రాపుగూర్చుటకు శివ ప్రాణనాయకి రాఘవుని | ॥మనసున॥ |