| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | సదాశివనాయకీ అంబ భవజల |
| ఫరజు - ఆది | |
| పల్లవి: | |
| సదాశివనాయకీ అంబ భవజల ధీ దాటించుట కభయదాన మొసగు | ॥సదాశివ॥ |
| అనుపల్లవి: | |
| చిదానందము గూర్చు నీపదభక్తి చిన్ననాడే గోరియున్నానుగా జననీ | ॥సదాశివ॥ |
| చరణము(లు): | |
| దండివేల్పుగ నా హృత్పుండరీకమందు నిండి తాండవించఖిలాండేశ్వరీ చండీ కామాక్షీ బాలచంద్రనిభానన నీ యండజేర్చి రాఘవుండనే దయతో | ॥సదాశివ॥ |