| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | వెఱ్ఱినమ్మికతో నీ - విఱ్ఱవీగుటె కాని తుద |
| సావేరి - త్రిశ్రజాతి త్రిపుట | |
| పల్లవి: | |
| వెఱ్ఱినమ్మికతో నీ - విఱ్ఱవీగుటె కాని తుద కొఱ్ఱగింజైనా వెంట - గొంపోవనగునె మనసా | ॥వెఱ్ఱి॥ |
| అనుపల్లవి: | |
| కుఱ్ఱతనయ ధన కోమలి నిజబంధు తారుమారులరయు దాయాదులకులోనై | ॥వెఱ్ఱి॥ |
| చరణము(లు): | |
| శమదమాది సద్గుణశాలివై నీలోని ప్రేమరూపమౌ నిజపెన్నిధిని గనవే వేమారు రాఘవుని పామరత్వమణచి శివ కామినీమణిగూర్చు కైవల్య మెరుగ | ॥వెఱ్ఱి॥ |