| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | పిన్నవానిగా నన్ను - పిలచి బ్రోవవే భవాని |
| మాయామాళవగౌళ - రూపక | |
| పల్లవి: | |
| పిన్నవానిగా నన్ను - పిలచి బ్రోవవే భవాని | ॥పిన్న॥ |
| అనుపల్లవి: | |
| తిన్నగా భవాబ్ధిదాటు - తెన్నుజూపి నీవు కన్న | ॥పిన్న॥ |
| చరణము(లు): | |
| కర్మశేషమున బహు - కాయముల ధరించి జగతి దుర్మదాంధుడనై తిరిగి - దురితములే జేసియుంటి ధర్మరూపిణి దాక్షాయణి - దయచేసి రాఘవుని | ॥పిన్న॥ |