| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | ఎంచి నీ నామము నామదిలో స్మ |
| వకుళాభరణ - ఆది | |
| పల్లవి: | |
| ఎంచి నీ నామము నామదిలో స్మ రించెదనె శివ కంచికామాక్షి అంబ | ॥ఎంచి॥ |
| అనుపల్లవి: | |
| సంచితముల హరియించి సనాతని వంచన జేయక వరములొసగుమని | ॥ఎంచి॥ |
| చరణము(లు): | |
| పంచబాణుని దహించిన దొర భ్రమి యించిన నీ సొగసెంచ నా తరమె చంచలాక్షి కరుణించ సమయమే అంచితముగ రాఘవుడు సుస్వరముతో | ॥ఎంచి॥ |