| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | విడచి సుఖింపవె మనసా దు |
| మధ్యమావతి - రూపక | |
| పల్లవి: | |
| విడచి సుఖింపవె మనసా దు ర్విషయాదులపై మోహము | ॥విడచి॥ |
| అనుపల్లవి: | |
| అడవిచరించు మృగసమ నడతలపై గల తమకము | ॥విడచి॥ |
| చరణము(లు): | |
| కామ మోహ లోభముల - కలకాల మీ భవకాననమున కామినీమణిపై ప్రేమ - కాంక్ష లుడుగనేరక మరి సోమరివయి బహు దుర్మో - హములజిక్కి సొలసిన నిను కామరిపు సతీమణి ఎటు - గాచును రాఘవునివలెను | ॥విడచి॥ |