| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | శైలతనయ నీ పాటి |
| ఫరజు - ఆది | |
| పల్లవి: | |
| శైలతనయ నీ పాటి కైవల్య మొసగు వారెవరె హిమ | ॥శైల॥ |
| అనుపల్లవి: | |
| కైలాసాధిపునికి ప్రియ కామినీయని నిను నిష్కాములై సేవించు వారికి | ॥శైల॥ |
| చరణము(లు): | |
| భువనము లెల్ల నీ కుక్షి నిడుకొని సవివరముగ సాకు సనాతని భువనేశ్వరి శుకపాణి సుహాసిని భవనీరధిని నిర్భయముగ రాఘవునికి | ॥శైల॥ |