| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | శంకరార్ధ శరీరిణి నీ పద |
| శంకరాభరణము - ఆది | |
| పల్లవి: | |
| శంకరార్ధ శరీరిణి నీ పద పంకజములె మైమరచి సేవించెద శివ | ॥శంకరార్ధ॥ |
| అనుపల్లవి: | |
| సంకటహారిణివని సదా ఘన కంకణములు గల కామేశ్వరి అంబ | ॥శంకరార్ధ॥ |
| చరణము(లు): | |
| శక్తి దెలిసి నీ నామాక్షరము లా సక్తి జపించు సుభక్తుడౌ రాఘవునికి ముక్తి ప్రదాన మొసగు పరాశక్తి తర్కములెల్ల మాని తాతోంధిత్తోం తకధిత్తొ మ్మని | ॥శంకరార్ధ॥ |