| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | సద్గురుచరణ సరోరుహ భక్తి వినా |
| బేహాగ్ - ఖండజాతి త్రిపుట | |
| పల్లవి: | |
| సద్గురుచరణ సరోరుహ భక్తి వినా సద్గతిగూర్చు సుసాధనము లేదన్నా | ॥సద్గురు॥ |
| అనుపల్లవి: | |
| సద్గుణయుత శమదమాది సంపదనిడి చిద్ఘనానంద సుధాకరుడై వెలిగే | ॥సద్గురు॥ |
| చరణము(లు): | |
| అతులిత భవభయబాధలణచి సుజ్ఞాన తతినిగూర్చు పరతత్వ చతురుడే హితవుమీర నిత్యానిత్యముల బోధించి సతతము రాఘవమానస సన్నుతుడౌ శ్రీ | ॥సద్గురు॥ |