| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | ఎపుడైనా భిన్నమౌ దానికొరకు |
| ఖమాస్ - ఆది | |
| పల్లవి: | |
| ఎపుడైనా భిన్నమౌ దానికొరకు ఇంత మమత యేటికే ఓమనసా | ॥ఎపుడైనా॥ |
| అనుపల్లవి: | |
| ఇపుడైనా దేహిదేహ భేద మరసి నిపుణతతో నిత్యానిత్య తత్వమెరుగక | ॥ఎపుడైనా॥ |
| చరణము(లు): | |
| పవనాది పంచభూత విస్తృతమౌ నవద్వారావృత దేహసౌధమున నివసించే పరబ్రహ్మమె నిత్యమని వివరముగాదెల్పు రాఘవుని మాటవినక | ॥ఎపుడైనా॥ |