| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | ముందువారలేమైరో - మోహపాశబద్ధులైన మన |
| పూర్వీకల్యాణి - రూపక | |
| పల్లవి: | |
| ముందువారలేమైరో - మోహపాశబద్ధులైన మన | ॥ముందు॥ |
| అనుపల్లవి: | |
| సుందరాంగులగూడి తాగి - తందనాల ప్రొద్దుబుచ్చిన | ॥ముందు॥ |
| చరణము(లు): | |
| కన్నతల్లిదండ్రులనక - అన్నదమ్ములాత్మజులనక పున్నెకార్యముల నెరుగక - భూతలమున విఱ్ఱవీగి చిన్ననాటనుండి ఎంతో - వన్నెలాడుల వలల జిక్కి | ॥ముందు॥ |
| పన్నగధర నిజభామిని - రాఘవనుత గుణశాలిని సన్నిధిజేరి భజించుట - కేమరి సోమరితనమున చెడి | ॥ముందు॥ |