| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | పరాశక్తి సదా భక్తార్తిభంజనివి కదా ఓ |
| తోడి - సంకీర్ణజాతి త్రిపుట | |
| పల్లవి: | |
| పరాశక్తి సదా భక్తార్తిభంజనివి కదా ఓ | ॥పరాశక్తి॥ |
| అనుపల్లవి: | |
| నిరాదరణ జూపి నా మొర విన నిరాకరింప తగునా | ॥పరాశక్తి॥ |
| చరణము(లు): | |
| దురాత్ములైన మానవాధములు నీదుమహిమలు దెలియక పరాభవించి తనకు మనుపరాని బాధలిడ జూతురు పురాణి ధర్మ సంవర్ధనివై తేజరిల్లుచు జగతిని జరామరణములణచి రాఘవుని బిరాన బ్రోవుము | ॥పరాశక్తి॥ |