| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | వేషధారుడైన నరునికిలలో వి |
| శంకరాభరణము - ఆది | |
| పల్లవి: | |
| వేషధారుడైన నరునికిలలో వి వేక మెటుజనించు మనసా నిగమతత్వ | ॥వేష॥ |
| అనుపల్లవి: | |
| భాషణాచతురుడై పామరులచెంత ఆర్షేయుడనని బల్కు దేశదిమ్మరి | ॥వేష॥ |
| చరణము(లు): | |
| వేదశాస్త్ర పురాణేతిహాసాది విద్యాపారంగతుని కైవడి తా సాధులక్షణాదక్షుని మాడ్కి నటించి వాదిడి రాఘవుని వంచించు కుతంత్ర | ॥వేష॥ |