| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | శక్తి జగజ్జననీ పాహీ పాహిమాం పరా |
| బేగడ - రూపక | |
| పల్లవి: | |
| శక్తి జగజ్జననీ పాహీ పాహిమాం పరా | ॥శక్తి॥ |
| అనుపల్లవి: | |
| భక్తజనాభీష్టప్రద భాగ్యసంవర్ధని శివ | ॥శక్తి॥ |
| చరణము(లు): | |
| సారాసారవిచార హృదయ విహారిణి ధీరాతిధీర దనుతశూరాంతకి త్రిశూలిని ఘోరాతిఘోర భవనీరధిజనతరణి శ్రీరాఘవారిచయ సారసంహారిణి | ॥శక్తి॥ |