| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | చేత కాసున్నపుడే దానధర్మములు |
| మాయామాళవగౌళ - ఆది | |
| పల్లవి: | |
| చేత కాసున్నపుడే దానధర్మములు చేసుకోరాదా మనసా చీకాకుపడక నీ | ॥చేత॥ |
| అనుపల్లవి: | |
| నీతియుతులౌ నిగమాగమకోవిదులకు ఖ్యాతిమీర పరమభాగవతులకు నీ | ॥చేత॥ |
| చరణము(లు): | |
| పేదసాదలపై పెద్దమనసుజేసి ఆదరించి సంతతాన్నదాతవై ఈ ధర సతీసుతులపైని మోహమణచి సాధుగతి రాఘవసన్నుత సాయుజ్యముకై | ॥చేత॥ |