| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | సారహృదయులై కడతేరుట కేనాటికైనా జిత సం |
| జనరంజని - సంకీర్ణజాతి త్రిపుట | |
| పల్లవి: | |
| సారహృదయులై కడతేరుట కేనాటికైనా జిత సం సారులుగావలెరా సనాతనధర్మయుత సత్కర్మఫల | ॥సార॥ |
| అనుపల్లవి: | |
| దారసుతధనాసక్తులై పెడదారిబట్టి పలుజన్మల కడ తేరె తరుణోపాయమెరుగక దుర్మతులై తిరుగువారిల | ॥సార॥ |
| చరణము(లు): | |
| ఇలలో అరుదై దొరకే యీనరజన్మమందే పోరాడి తలపులెల్ల శివసతిపై నిలిపి పరతత్వాయత్తచిత్తులై కులమతవర్గభేదముల గుట్టెరిగి కుతర్కములెల్లవీడి ని ర్మల మానసులై రాఘవనుత పునరావృత్తరహిత పథము సాధించి | ॥సార॥ |