| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | తనువే ధర్మార్థకామమోక్షము లార్జింపదగు సాధనము |
| గౌళ - ఖండజాతి ఆట | |
| పల్లవి: | |
| తనువే ధర్మార్థకామమోక్షము లార్జింపదగు సాధనము | ॥తనువే॥ |
| అనుపల్లవి: | |
| వినవే మనసా సకలేంద్రియముల చక్కనై వెలిగే మానవ | ॥తనువే॥ |
| చరణము(లు): | |
| నాక పితృలోక వాసులకే కాలమాశ్రయమై రాజిల్లు | ॥తనువే॥ |
| సఫల మనోరథుడౌట కెంచి యాగాది సుకర్మము లాచరించి దేవేంద్రాది సురగణములకు హవిర్భాగములను బంచు | ॥తనువే॥ |
| అన్నసార మాధారమై భువిని రుధిరమాంసమేధస్సులచే నభ్యున్నతిజెంది దుర్విషయాదులకు లోబడి చెడని | ॥తనువే॥ |
| సకలజీవరాసుల నరుదైదొరకు నరజన్మమిదిగాక భరతభూమిని జనించు ప్రబలపుణ్యధనయుతమై బరగెడి | ॥తనువే॥ |
| నాదయోగజిజ్ఞాసగలిగి ప్రజ్ఞానవరగురు ప్రముఖవికాసుని ప్రేమగొలిచి సుజ్ఞాన సులక్షణశిక్షితుడై తా వాదతర్కముల మాని మౌనియై నాదాఖండవిభూతి నాత్మగని రాఘవసన్నుత చిదానంద చిద్రూపముజెందు | ॥తనువే॥ |