| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | ఊరక దొరకునా ఉమాపదసరసిజ మాత్మనిల్పను తన |
| ఆరభి - ఖండజాతి ఆట | |
| పల్లవి: | |
| ఊరక దొరకునా ఉమాపదసరసిజ మాత్మనిల్పను తన | ॥కూరక॥ |
| అనుపల్లవి: | |
| పోరాడి శత్రుచయమారింటి దునిమి తలపులెల్ల శివసతిపై నిడ | ॥కూరక॥ |
| చరణము(లు): | |
| ధరణీసురవర ధర్మమరసి యజ్ఞకర్మాదుల గల మర్మమెరుగ | ॥కూరక॥ |
| పరమభక్తజన పావని, స్మరరిపుమానిని, భవభయహారిణి, త్రిభువనపాలిని, కమల కపాల గదా శుక శూల విలాసిని | ॥ఊరక॥ |
| ధనసుదతీమణి తనయులయెడగల తమకమున దగిలి తనపెరయని బహుతమమున మునుగుచు పరతత్వ మహత్వమెరుగని నరున | ॥కూరక॥ |
| పరమానందసుఖ మాత్మకిడు నిజమార్గమెరుగు సమాధియుతు, పదమాశ్రయించి, ఉమాకథ లభిమానమున విన | ॥కూరక॥ |
| రాఘవగీత స్వరములందు, శ్రుతిరాజిలుచు, నాధారమగు నోంకారనాద, తరంగలయ, మకరంద రుచి లే | ॥కూరక॥ |