| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | సుందరి సదా నీ పదార |
| శుద్ధధన్యాసి - ఆది | |
| పల్లవి: | |
| సుందరి సదా నీ పదార విందములకు నా వందనమే త్రిపుర | ॥సుందరి॥ |
| అనుపల్లవి: | |
| కందర్పజనకసోదరి శర దిందునిభానన డెందమలర పర శివ | ॥సుందరి॥ |
| చరణము(లు): | |
| స్వాంతమున విషయభ్రాంతులుడిగి నిన్న శ్రాంతము దలచు విశ్రాంతిగల వే దాంతులకిడు ముక్తికాంతామణి నొసగి కుంతలాంబ రాఘవుని కోర్కెదీర్చు | ॥సుందరి॥ |