| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | నీ సేవకు తగు నిపుణతలేదని నాయెడ |
| సావేరి - మిశ్రజాతి ఝంపె | |
| పల్లవి: | |
| నీ సేవకు తగు నిపుణతలేదని నాయెడ నిర్దయజూపేవా జననీ నిగమాగమ హితమౌ | ॥నీ సేవకు॥ |
| అనుపల్లవి: | |
| దాసజనావనియని మనసారగా వన జాసనాది సురవరులు బొగడి సేవించిన | ॥నీ సేవకు॥ |
| చరణము(లు): | |
| కామజారి వామాంకముపై కైలాసగిరిని ప్రేమమీర శివకామినివై వెలసిన నీ మోముజూపి భవమోచని రాఘవునకు భువి కామితములిడి కరుణబ్రోచు కామేశ్వరి | ॥నీ సేవకు॥ |