| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | శ్రీకాంత సోదరీ నన్నుబ్రోవ |
| ఫరజు - ఆది | |
| పల్లవి: | |
| శ్రీకాంత సోదరీ నన్నుబ్రోవ చీకాకుపడెద వేకారణమొ | ॥శ్రీకాంత॥ |
| అనుపల్లవి: | |
| ఏకాంతముగా శివునిగూడు వేళా రాకేందుముఖి భక్తార్తీ దీర్చలేవా | ॥శ్రీకాంత॥ |
| చరణము(లు): | |
| సంచితాగామి ప్రారబ్ధసంభవమౌ ఎంచరాని జననమరణముల వారించె పంచశరహరుని పడతీ నీదు బిరుదా లించి వేడుకొను రాఘవుని శంకించి | ॥శ్రీకాంత॥ |