| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | పదారవిందములే గతియని |
| ప్రణవప్రియ - ఆది | |
| పల్లవి: | |
| పదారవిందములే గతియని సదా నమ్మితినికదా సనాతని | ॥పదార॥ |
| అనుపల్లవి: | |
| మదాసురగణవిదారిణివైన నీ కథా సుధారసము ధాత్రి చవిగొని | ॥పదార॥ |
| చరణము(లు): | |
| పురాణి నాయెడ పరాకుసేయక మొరాలించి కడు బిరాన బ్రోవను నిరాదరణ జేసితే నాకెవరు వరాలొసగువారు రాఘవార్చిత | ॥పదార॥ |