| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | మదనారీవర సుదతి మహేశ్వరి |
| కానడ - ఆది | |
| పల్లవి: | |
| మదనారీవర సుదతి మహేశ్వరి మాతంగి నాపై అభిమానమెన్నడు గల్గు | ॥మదనారీ॥ |
| అనుపల్లవి: | |
| మదరాక్షసహరి మాధవసోదరి నీ పదరాజీవ సద్భక్తిసంపద నే కోరితి | ॥మదనారీ॥ |
| చరణము(లు): | |
| ఆజన్మము నా అంతరంగమున తేజరిల్లు నీ దివ్యరూపముగోరి ఈజగతి నిన్నె పూజించు రాఘవుని మోజుదీరగ నీ మోమొకసారి జూపవు | ॥మదనారీ॥ |