| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | సితనగ నిలయుని సుదతీ సుమతీ |
| వివర్ధిని - ఆది | |
| పల్లవి: | |
| సితనగ నిలయుని సుదతీ సుమతీ శ్రితజనానంద చిద్రూపిణి | ॥సితనగ॥ |
| అనుపల్లవి: | |
| వితరణగా నా విన్నపమాలించి వెతదీర్ప నిదేవేళ వివర్ధిని | ॥సితనగ॥ |
| చరణము(లు): | |
| పురాతనముగా ధరాతలిని కడు విరామములేని జరామరణముల పురాణి వగజెందు రాఘవుని గని వరాలొసగి బ్రోవ రావలె జనని | ॥సితనగ॥ |