| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | కామేశ్వరి నీపదకంజములే గతియని |
| కాంభోజి -ఖండజాతి త్రిపుట | |
| పల్లవి: | |
| కామేశ్వరి నీపదకంజములే గతియని నమ్మి పూజించెదనే శివ | ॥కామేశ్వరి॥ |
| అనుపల్లవి: | |
| ఈమేదిని అరుదై దొరకే నర జన్మ తనకబ్బియున్న ఈవేళనె | ॥కామేశ్వరి॥ |
| చరణము(లు): | |
| మనసార తులసీ బిల్వాది కుముద మందారారవింద మల్లికా సుమములచే నెనరుమీర ఆగమవిధి ననుసరించి దినదినము రాఘవుని మై పులకరింప | ॥కామేశ్వరి॥ |