| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | వదలిపోయేనాడు నీవెంటతోడై |
| పూర్వీకల్యాణి - ఆది | |
| పల్లవి: | |
| వదలిపోయేనాడు నీవెంటతోడై వచ్చువారెవరున్నారే ఓమనసా ఈ తనువు | ॥వదలి॥ |
| అనుపల్లవి: | |
| విధివశుడై తానెడతెగ కార్జించి పొదుపుజేసిన పుణ్యపాపములే గాక | ॥వదలి॥ |
| చరణము(లు): | |
| ప్రేమజూపు నిజభామామణిగాని నోముల నోచికన్న ఆత్మజులేగాని పామరుడై బాగాదాచిన ధనముగాని ఈ మహిలోనే విడచి యమకింకరులపాలై | ॥వదలి॥ |
| మేరలేని భోగభాగ్యములందు మోజు దీరక బహుదుర్విషయాదుల మరగి ఘోరపాప కర్మాధీనుడై రాఘవుని దూరి శ్రీ దేవీగానసుధా పానము జేయక | ॥వదలి॥ |