| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | అంతా బ్రహ్మమయమురా |
| మోహన - ఆది | |
| పల్లవి: | |
| అంతా బ్రహ్మమయమురా ఈ జగదుదంత మెరిగిన నిగమాంత కోవిదుల | ॥కంతా॥ |
| అనుపల్లవి: | |
| సంతతధామ మనంతనామ మా ద్యంత రహితమై అహరహము వెలిగే | ॥దంతా॥ |
| చరణము(లు): | |
| సకల భూత కులమతముల తా నిష్క ళంకమై నెగడు నిర్వికారమురా ప్రకటిత రాగభావతాళ చయమం దొకటై తనరు రాఘవార్చిత నాదాఖండ | ॥మంతా॥ |