| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | అందుకొనవమ్మా ఓ త్రిపుర |
| సావేరి - ఆది | |
| పల్లవి: | |
| అందుకొనవమ్మా ఓ త్రిపుర సుందరీ కర్పూరానంద నీరాజన | ॥మందుకొన॥ |
| అనుపల్లవి: | |
| ఇందరిలో నా డెందము రంజిల్ల వందనము జేసి వసుధ నిను దలతు | ॥నందుకొన॥ |
| చరణము(లు): | |
| భావరాగతాళముల జతగూర్చి పావనమగు నీనామాక్షర గాన ప్ర భావముచే భక్తవాహినిలో శ్రీ దేవీగానసుధాకృతిగా నినుజూచితి | ॥నందుకొన॥ |