| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | చెప్పుకొంటినమ్మా జననీ నా |
| ముఖారి - ఆది | |
| పల్లవి: | |
| చెప్పుకొంటినమ్మా జననీ నా త్రిప్పట లెల్ల నీతో | ॥చెప్పుకొంటి॥ |
| అనుపల్లవి: | |
| మెప్పులేని ధనకాములతో వియ్యము తప్పదాయె తగుధనమెటు చేకూర్తువొ | ॥చెప్పుకొంటి॥ |
| చరణము(లు): | |
| ఏనాటి పాపమో ధనహీనులై కొంద రీనాటి మానవులు మగువల గను చున్నారిల విధివశమున దీనులై యా పన్నరక్షకీ జగము తీరెల్ల రాఘవుని | ॥చెప్పుకొంటి॥ |