| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | ఎందుకీ భువిలో నరుడై తా |
| కీరవాణి - ఆది | |
| పల్లవి: | |
| ఎందుకీ భువిలో నరుడై తా నేర్పడెనో ఎంచి చూడవే మనసా | ॥ఎందుకీ॥ |
| అనుపల్లవి: | |
| అందరాని దుర్మోహ దురాశల జెంది సతత మీభవబంధమున వగచుటకా | ॥ఎందుకీ॥ |
| చరణము(లు): | |
| పరమత కులముల దూరుటకా లేక పరమార్థమెరిగి ధర్మాచరణుడౌటకా సరసాత్ములతో విరసములాడుటకా భూ సురుడౌ రాఘవుడు భోగలాలసుడౌటకా | ॥ఎందుకీ॥ |