| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | కలుగునా కామాక్షీ నీదయలేక |
| కేదారగౌళ - మిశ్రజాతి ఝంపె | |
| పల్లవి: | |
| కలుగునా కామాక్షీ నీదయలేక కలిమానవులకు నీ పదకంజములపై భక్తి | ॥కలుగునా॥ |
| అనుపల్లవి: | |
| ఇలధనదార సుతాది దుర్మోహ దురాసక్తులై పలుజన్మల భవబద్ధులైన పామరులకు | ॥కలుగునా॥ |
| చరణము(లు): | |
| పరమ భాగవతులను శంకించు నపచారులై వెరపులేక పరదార గమనోల్లాసులై స్థిరముగాని తమ కలిమి బలమున కుప్పొంగుచు దురితాత్ములై చరించి రాఘవుని దూరితె | ॥కలుగునా॥ |