| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | తనవారని నమ్మిచెడకురా నిజ |
| సామ - ఆది | |
| పల్లవి: | |
| తనవారని నమ్మిచెడకురా నిజ తరుణీ తనయ దాయాద స్వజనులంతా | ॥తన॥ |
| అనుపల్లవి: | |
| మనసార స్మరరిపు మానినీపద మారాధించుటె తుదకాధారమౌ గానీ | ॥తన॥ |
| చరణము(లు): | |
| వట్టి బూటకానుబంధ మిదని బాగా తట్టి నీకెవ్వరీగుట్టు తెల్పేరు మట్టిపాలై మాపోరేపో మరెన్నడో మటుమాయమౌ ఈ దేహభ్రాంతి మానలేక రాఘవ | ॥తన॥ |