| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | జ్ఞానభిక్షమిడవే జననీ నా య |
| బహుదారి - ఆది | |
| పల్లవి: | |
| జ్ఞానభిక్షమిడవే జననీ నా య జ్ఞానమణచి సుజ్ఞానునిగాజేయు | ॥జ్ఞాన॥ |
| అనుపల్లవి: | |
| జ్ఞానప్రసూనాంబా యీభవ కాననమున తుదిగానలేక నిను వేడితి | ॥జ్ఞాన॥ |
| చరణము(లు): | |
| కన్నతల్లి యాపన్నరక్షకీ నా విన్నపము విని ప్రసన్నమూర్తివై నిన్నెగాని తన మనసున కన్యము ఉన్నతిగాదని యుప్పొంగు రాఘవునికి | ॥జ్ఞాన॥ |