| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | రారె రమణులంతా శ్రీ రాజ |
| కేదార - ఆది | |
| పల్లవి: | |
| రారె రమణులంతా శ్రీ రాజ రాజేశ్వరికి కర్పూర హారతు లివ్వ | ॥రారె॥ |
| అనుపల్లవి: | |
| తీరెరిగిన త్రిభువనపాలినిగా తా పార జూచి భక్తపాలన జేయునట | ॥రారె॥ |
| చరణము(లు): | |
| హరిహరసుర మునివరులెల్ల సేవింప దరహాస వదనయై దయజూపు వేళనే | ॥రారె॥ |
| భారమనక భవ బాధలణచి మన సార వరము లిచ్చి లాలించు లలితాంబ చెంతకు | ॥రారె॥ |
| అన్ని వేళల ఈ నరజన్మమందె మనను కన్నతల్లిగా బిలచి గారవించునట | ॥రారె॥ |
| మానక శ్రీ దేవీగానసుధా రస పాన మత్తచిత్తులై జ్ఞానానందతీర్థునితో | ॥రారె॥ |
| పరమ భక్తజనపాలిని కమల కపాల గదాంకుశ ధారిణి శూలిని నేమరక సదా మాధవ సోదరి నామభజన మనసార జేయుచూ | ॥రారె॥ |